Raspberry Pi అంటే ఏమిటి? దీనిని దేని కోసం ఉపయోగిస్తారు?
ఈ ఆర్టికల్ లో Raspberry Pi అంటే ఏమిటి ? దీనిని దేనికోసం ఉపయోగిస్తారు అనేది తెలుసుకోబోతున్నారు,
Raspberry Pi అనేది తక్కువ ఖర్చుతో కూడిన, క్రెడిట్ కార్డు పరిమాణంలో ఉండే కంప్యూటర్. దీనిని కేబుల్స్ తో టీవీ లేదా మానిటర్ కి Connect చేసి మరియు కీబోర్డ్, మౌస్ ని ఉపయోగించి కంప్యూటర్ లా ఉపయోగించుకోవచ్చూ. డెస్క్టాప్ కంప్యూటర్ లో ఏమేమి చేయగలమో ఈ Raspberry Pi కూడా అన్ని చెయ్యగలదు. దీనిని Portable Mini Computer అని కూడా అనుకోవచ్చూ. ఈ Raspberry Pi లో చాలా ఆపరేటింగ్ సిస్టమ్స్ ( OS ) ని వేసుకొని ఉపయోగించుకోవచ్చూ మరియు చాలా వరకు దీని ప్రాజెక్ట్స్ చెయ్యడానికి ఉపయోగిస్తారు. ఈ Raspberry Pi ని ఎందుకు చేసారు అంటే పెద్దలు మరియు పిల్లలు ప్రోగ్రామింగ్ మరియు కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అని తీసుకువచ్చారు. ఈ Raspberry Pi లో చాలా నమూనాలు ( Models ) కూడా ఉన్నాయి. Raspberry Pi ని Electrobot అని కూడా అంటారు ఎందుకు అంటే దానిని కంప్యూటర్ లాగానే కాకుండా Door Lock మరియు Unlock చెయ్యడానికి, Games ఆడుకోడానికి, Web Server, Home security system, Network monitoring tool, Raspberry Pi voice assistant, VPN server, Portable Pi hacking machine ఇలా చాలా పనులకు ఈ Raspberry Pi పని చేస్తుంది.
ఈ Raspberry Pi కి Power Supply కోసం కేవలం 5V చార్జర్ సరిపోతుంది మరియు దీనికి రెండు 4K Monitors కి Connect చేసుకోవచ్చూ మరియు Camera , Display ని కూడా Connect చేసుకోవచ్చు, ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవడానికి వైఫై తో పాటు Ethernet Port కూడా ఉంటుంది. ఇందులో Bluetooth కూడా ఉంటుంది. Storage కోసం Memory Card ని ఉపయోగించాలి. ఇందులో 40 GPIO ( General Purpose Input/output ) కూడా ఉంటాయి.
మీరు కూడా Raspberry Pi ని Hacking Machine లా ఉపయోగించుకోవాలి అనుకుంటే కింద ఉన్న వీడియోస్ చుడండి.
1. Raspberry Pi Overview & Usage – తెలుగులో
2. Raspberry Pi 4 : Kali Linux Installation – తెలుగులో
3. How to setup x11VNC Server on Kali Linux ( Raspberry Pi ) – తెలుగులో
మీరు ఈ ఆర్టికల్ లో Raspberry Pi గురించి మరియు దానిని ఎలా ఉపయోగిస్తారు అనేది తెలుసుకున్నారు అనుకుంటున్నాం మీకు నచినట్లైతే మీ తోటివారితో షేర్ చెయ్యండి…❤️